ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుండి సోమవారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీల్లో రూ.151 కోట్ల విలువైన నగదు, నగలు, వస్తువులు పట్టుబడ్డాయని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి అర్చనా పట్నాయక్ ప్రకటించారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అరివాలయంలో డీఎంకే ఆశావహుల వద్ద ఉత్సాహభరితంగా ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర ప్రజలు ఢిల్లీ అధిపత్య కూటమిని అంగీకరించరని డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్ల డీఎంకే పాలనలో మహిళలకు భద్రతలేదంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాల్లో ముగ్గురు మాజీమంత్రులు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు.
సాధారణంగా ఓ గ్రామం ఏదేని ఒక పంచాయతీలో గానీ, లేదా ఒక శాసనసభ నియోజకవర్గంలోగానీ ఒక లోక్‌సభ నియోజకవర్గంలో గానీ వుంటుంది.
తిరునల్వేలి జిల్లా పడమటికనుమల ప్రాంతానికి చేరువగా మణిముత్తారు డ్యామ్ నుండి సుమారు30 కి.మీ.ల దూరంలో మాంజోలై ప్రాంతం ఉంది. అక్కడి నుండి సుమారు 5 కి.మీ.ల దూరంలో నాలుముక్కు, అక్కడి నుండి 10 కి.మీ.ల దూరంలో ఊత్తు ప్రాంతం ఉన్నాయి.
ఆదవ్ అర్జున్ ఎవరో తనకు తెలీదని రాష్ట్ర అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. తిరునల్వేలిలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటరన్న ఎవరిని కరుణిస్తాడోనని ఆయా అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమీపిస్తుండడంతో ఉమ్మడి. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు ఆయా మునిసిపాలిటీలలో ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.
మునిసిపల్ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓట్లు నిర్ణయాత్మకంగా మారనున్నాయి. మునిసిల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో కార్పొరేటర్లు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి.