రాజధాని అమరావతి ప్రాంతంలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటూ లోక్ సభ ఆమోదం తెలపడంతో సందడి మెుదలైంది. ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కృషి వల్లే రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభలో ఆమోదం పొందిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు.
రాజధాని అమరావతిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. పార్లమెంట్‌లో రాజధాని అమరావతిపై కీలక చర్చ జరిగే సమయంలో తాడేపల్లి ప్యాలెస్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు.
రాజధానిపై గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఎంపీ పురందేశ్వరి విమర్శించారు. అమరావతి తొలి ప్రజా రాజధానిగా గుర్తింపు తెచ్చుకుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించటం కోసం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. వైసీపీ సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ సభనుంచి వాకౌట్ చేశారు.
వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఆనందించారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని పేర్కొన్నారు.
రూపాయి ఖర్చు లేకుండా వేల ఎకరాలు అమరావతి కోసం సమీకరించిన వ్యక్తి చంద్రబాబు అని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కొనియాడారు. లోక్‌సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చలో కేంద్రమంత్రి మాట్లాడారు.