14,553 పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:11 AM
రాష్ట్రంలో 14,553 పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా...
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 14,553 పోలీసు పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పోలీసుశాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న రెండు పోలీసు బెటాలియన్లకు నూతన నియామక ప్రక్రియ ద్వారా సిబ్బందిని సర్దుబాటు చేయనున్నారు. కానిస్టేబుళ్లు, ఎస్సైల రిక్రూట్మెంట్కు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంస్ధాన్ నారాయణపూర్‌లో 84.24 ఎకరాల్లో, అమన్‌గల్‌లో 125 ఎకరాల్లో తెలంగాణ స్పెషల్ పోలీసు బెటాలియన్లను కొత్తగా ఏర్పాటు చేయబోతున్నారు.