ఈ ఏడాది 4.01 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:13 AM
రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)లో 4.01 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)లో 4.01 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో 6,32,652 ఎకరాలను సాగులోకి తేవాలనేది లక్ష్యం కాగా కేవలం 50,413 ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం (2024-25)లో కాస్త తక్కువగా 50,111 ఎకరాలే సాగులోకి వచ్చాయి. పరిమిత లక్ష్యాలు పెట్టుకున్నప్పటికీ క్షేత్రస్థాయి యంత్రాంగం నిర్లిప్తత కారణంగా నిర్దేశిత ప్రాజెక్టులకు నిధులు అందకపోవడంతో లక్ష్యం నీరుగారిపోయింది. విడుదల చేసిన బిల్లులన్నీ పెండింగ్ చెల్లింపులకే పోతుండటం ఇబ్బందికరంగా మారింది.