Share News

ప్రారంభానికి సిద్ధమైన 3 ఎత్తిపోతల పథకాలు

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:38 AM

రాష్ట్రంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువపై సుమారు రూ.106.04 కోట్ల వ్యయంతో నిర్మించిన జకోరా...

ప్రారంభానికి సిద్ధమైన 3 ఎత్తిపోతల పథకాలు

  • నిజామాబాద్‌లో 7975 ఎకరాలకు అందనున్న సాగునీరు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో మూడు ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి రానున్నాయి. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని నిజాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాలువపై సుమారు రూ.106.04 కోట్ల వ్యయంతో నిర్మించిన జకోరా, చందూరు, చింతకుంట ఎత్తిపోతల పథకాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. వీటి ద్వారా జిల్లాలోని వర్ని, చందూర్‌, మొస్రా మండలాల పరిధిలో ఉన్న 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి త్వరలోనే ఈ పథకాలను ప్రారంభించనున్నారు. పనులన్నీ వేగంగా పూర్తయి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఈసందర్భంగా మంత్రి తెలిపారు.

Updated Date - Apr 12 , 2026 | 04:38 AM