Share News

నోటిఫైడ్‌ వ్యాధిగా క్యాన్సర్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:10 AM

రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మహమ్మారిని నోటిఫైడ్‌గా వ్యాధిగా ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది.

నోటిఫైడ్‌ వ్యాధిగా క్యాన్సర్‌

హైదరాబాద్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మహమ్మారిని నోటిఫైడ్‌గా వ్యాధిగా ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. ఈమేరకు క్యాన్సర్‌ను నోటిఫైడ్‌ వ్యాధిగా ప్రకటిచండంతో పాటు రిజిస్ట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ క్యాన్సర్‌ కేసుల వివరాలను విధిగా వైద్యశాఖకు అందించాల్సి ఉంటుంది. తద్వారా క్యాన్సర్‌ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది.

Updated Date - Apr 01 , 2026 | 05:10 AM