Share News

శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..

ABN , Publish Date - Apr 05 , 2026 | 09:04 AM

ఐపీఎల్-2026 ఆరంభంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. శనివారం అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు.

శుభ్‌మన్ గిల్‌కు గాయం.. జట్టుతో చేరడానికి ఎంత సమయం పడుతుంది..
Shubman Gill injury update

ఐపీఎల్-2026 ఆరంభంలోనే గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. శనివారం అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌కు గిల్ దూరమయ్యాడు. గిల్ లేకపోవడం జీటీకి మైనస్‌గా మారింది. రాజస్థాన్ నిర్దేశించిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన జీటీ ఐపీఎల్-2026లో తమ రెండో ఓటమిని చవిచూసింది (Shubman Gill injury update).


శుభ్‌మన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో రషీద్ ఖాన్ జీటికి నాయకత్వం వహించాడు. గిల్‌ కండరాల నొప్పితో బాధపడుతున్నాడని, త్వరలోనే అతడు తిరిగి వస్తాడని ఆశిస్తున్నామని రషీద్ పేర్కొన్నాడు. జీటీ తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 8న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉంది. ఈ మ్యాచ్‌ సమయానికి గిల్ అందుబాటులోకి వస్తాడని జీటీ సహాయక కోచ్ పార్థివ్ పటేల్ అన్నాడు (Gill muscle spasm).


'దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా గిల్ మెడ బెణికింది (Shubman Gill return). రెండు రోజుల క్రితం కండరాలు పట్టేశాయి. రాబోయే మ్యాచ్‌కు అతను ఫిట్‌గా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. గాయం అంత తీవ్రంగా కనిపించడం లేదు. గాయాల నిర్వహణ నా నైపుణ్యం కాదు, కానీ అతను ఖచ్చితంగా కోలుకుంటాడని నేను చెప్పగలను' అని పార్థివ్ పటేల్ అన్నాడు. శనివారం జరిగిన మ్యాచ్‌‌లో 211 పరుగుల లక్ష్య ఛేదనలో జీటీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 204 పరుగులు చేసి కేవలం ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.


ఇవి కూడా చదవండి..

కోల్‌కతానూ కొట్టగలం.. పాక్ విదేశాంగ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..


ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Apr 05 , 2026 | 09:05 AM