Share News

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:57 PM

ప్రస్తుతం ఐసీసీని బీసీసీఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, కొలంబోలేని పిచ్‌ను ఏ క్షణంలోనైనా టీమిండియాకు అనుకూలాంగా మార్చవచ్చని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ సంచలన ఆరోపణలు చేశాడు.

కొలంబో పిచ్‌ను టీమిండియాకు అనుకూలంగా మార్చేస్తారు.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
India vs Pakistan controversy

ప్రస్తుతం ఐసీసీని బీసీసీఐ తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, కొలంబోలోని పిచ్‌ను ఏ క్షణంలోనైనా టీమిండియాకు అనుకూలాంగా మార్చవచ్చని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సక్లయిన్ ముస్తాక్ సంచలన ఆరోపణలు చేశాడు. టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో ఉపయోగించబోయే పిచ్‌ గురించి ముస్తాక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు (Saqlain Mushtaq controversy).


'ప్రస్తుతం ఐసీసీ ఎవరి ఒత్తిడికి తలొగ్గి పని చేస్తోందో అందరికీ తెలుసు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో మనకు తెలియకుండానే కొద్ది గంటల్లో గ్రౌండ్స్‌మెన్ పిచ్ స్వరూపాన్ని మార్చొచ్చు' అని ఓ టీవీ కార్యక్రమంలో సక్లయిన్ ముస్తాక్ అన్నాడు. అలాగే పాక్ బౌలింగ్ ఆర్డర్ గురించి కూడా మాట్లాడాడు. భారత్‌తో మ్యాచ్‌కు పేసర్ ఉస్మాన్ తారిక్ కీలకం అవుతాడని, చివరి ఓవర్లు ఎవరు వేస్తారనేది అతి ముఖ్యమని ముస్తాక్ అన్నాడు. పాక్ బౌలింగ్ ఆర్డర్ పైనే విజయం ఆధారపడి ఉందని ముస్తాక్ అభిప్రాయపడ్డాడు (ICC BCCI influence claim).


ప్రస్తుతం పాకిస్థాన్ టీ-20 ప్రపంచకప్‌లో తన మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడుతోంది (India vs Pakistan controversy). ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాక్ విజయం సాధించింది. ఆదివారం భారత్‌తో తలపడనుంది. మరోవైపు భారత్ ఇప్పటికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. మరికొద్ది సేపట్లో ఢిల్లీ వేదికగా జరగబోయే మ్యాచ్‌లో నమీబియాతో తలపడబోతోంది.


ఇవి కూడా చదవండి..

చెత్త బుట్టలో పడేసినా.. దొరికేసిన బంగారం.. దుబాయ్‌లో ఏం జరిగిందంటే..


స్థిరంగా బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 12 , 2026 | 12:57 PM