ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాల చిత్రీకరణ
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:29 AM
ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖాగోయల్ తెలిపారు.
టిప్‌లైన్ సమాచారంతో నిందితుడి అరెస్టు
హైదరాబాద్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఐదేళ్ల చిన్నారి అసభ్య దృశ్యాలను చిత్రీకరించిన ఘటనలో నిందితుడిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖాగోయల్ తెలిపారు. చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన దృశ్యాలను నిరోధించే టిప్‌లైన్ ద్వారా అందిన సమాచారాన్ని తమ చైల్ ్డ ప్రొటెక్షన్ యూనిట్ లోతుగా విశ్లేషించిందని, సేకరించిన వీడియోలో ఉన్న ఆధారాలను సాంకేతికతతో పరిశీలించిన తర్వాత ఈ నేరం హైదరాబాద్‌లో జరిగినట్లు గుర్తించామని ఆమె వివరించారు. నిందితుడు గోల్కొండ కుమ్మరివాడి నివాసి మహ్మద్ అహ్మద్‌గా నిర్ధారించి అతడ్ని అరెస్టు చేశామని ఆమె తెలిపారు. బాఽధితురాలికి నిందితుడు అన్నయ్య వరుస అవుతాడని, చిన్నారి అతడ్ని ప్రేమతో భయ్యా అని పిలిచేదని, ఈ నమ్మకాన్ని ఆసరాగా తీసుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికను ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్లి అసభ్య దృశ్యాలను చిత్రీక రించేవాడని తమ విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. పిల్లల సంరక్షణ విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.