బాలుడిపై లైంగిక దాడి, వేధింపులు
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:28 AM
జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మునిసిపాలిటీలోని మూడో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆసి్ఫఖాన్పై మంగళవారం పోక్సో కేసు నమోదైంది.
అలంపూర్ బీఆర్ఎస్ కౌన్సిలర్‌పై పోక్సో కేసు నమోదు
అలంపూర్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ మునిసిపాలిటీలోని మూడో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆసి్ఫఖాన్పై మంగళవారం పోక్సో కేసు నమోదైంది. 2024 నవంబరులో అలంపూర్ పట్టణానికి చెందిన ఓ బాలుడిని గాంధీ విగ్రహం దగ్గరకు రావాలని ఆసి్‌ఫఖాన్ ఫోన్ చేశారు. వచ్చిన బాలుడిని ఆసి్‌ఫఖాన్, పరశురాం, మరో ఇద్దరు వ్యక్తులు అపహరించి ర్యాలంపాడు దగ్గర గల పహాడ్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలుడిపై ఆసి్‌ఫఖాన్ లైంగిక దాడి చేయగా, ఈ విషయం బయటకు పొక్కకుండా మొదట జాగ్రత్తపడ్డారు. ఆసి్‌ఫఖాన్ బాలుడితో మాట్లాడిన ఆడియోను అప్పటి బీఆర్ఎస్ కౌన్సిలర్ ఇంతియాజ్ అలీతో కలిసి బాధితుడు సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. దీంతో వారిద్దరిపై రూ. 60 లక్షలకు ఆసి్‌ఫఖాన్ పరువునష్టం దావా వేయగా, ఆ కేసు నమోదైన విషయం ఇప్పుడు నోటీసులు వచ్చేవరకు బాధితుడికి తెలియదు. దీంతో బాలుడు లైంగిక దాడి ఘటనపై పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశాడు. కౌన్సిలర్‌పై కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.