ఘనంగా శ్రీకృష్ణదేవరాయుల జయంతి
ABN , Publish Date - Feb 16 , 2026 | 11:46 PM
శ్రీకృష్ణదేవరాయుల 555వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక 60 అడుగుల రోడ్డులోని రాయల్ సర్కిల్ని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహానికి గుంతకల్లు బలిజ సంఘం ఆధ్వర్యంలో పలువురు నివాళుర్పించారు.
గుంతకల్లుటౌన, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): శ్రీకృష్ణదేవరాయుల 555వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక 60 అడుగుల రోడ్డులోని రాయల్ సర్కిల్ని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహానికి గుంతకల్లు బలిజ సంఘం ఆధ్వర్యంలో పలువురు నివాళుర్పించారు. ఇందులో ఆ సంఘం అధ్యక్షుడు పూల రమణ, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, ఉపాధ్యక్షుడు మునిశ్వరప్ప, సహాయ కార్యదర్శి శ్రీనివాసులు, సభ్యులు సుబ్బయ్య, వక్కల ఉమ, బీకే మధు, పట్నం రామాంజినేయులు, రమేష్, వెంకటేశ్వర్లు, స్రవంతి, జ్యోతి, లత, శారదా, నారాయణమ్మ పాల్గొన్నారు.