Share News

అందుబాటులోకి బెజవాడ వెస్ట్‌ బైపాస్‌

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:25 AM

పశ్చిమ బైపాస్‌ మంగళవారం అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ల్యాండింగ్‌ పాయింట్‌...

అందుబాటులోకి బెజవాడ వెస్ట్‌ బైపాస్‌

విజయవాడ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పశ్చిమ బైపాస్‌ మంగళవారం అర్ధరాత్రి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది. పిన్నమనేని సిద్ధార్థ వైద్య కళాశాల ల్యాండింగ్‌ పాయింట్‌ మీదుగా వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ ప్యాకేజీ-3 చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 37 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజీ-4లో గొల్లపూడి, సూరాయపాలెం, వెంకటపాలెం, మంగళగిరి, కాజ వరకు మరో 12 కిలోమీటర్లు ఉంది. పశ్చిమ బైపా్‌సలో ప్యాకేజీ-3, 4లలో వెదురుపావులూరు, వెంకటపాలెం దగ్గర ఏర్పాటు చేసిన టోల్‌ ప్లాజాలు అందుబాటులోకి వచ్చాయి. కాగా, ఎన్‌హెచ్‌-16పై 22 ఏళ్ల పాటు సేవలందించిన పొట్టిపాడు టోల్‌ప్లాజాను అధికారులు మూసివేశారు.

Updated Date - Apr 01 , 2026 | 06:26 AM