Share News

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - Apr 01 , 2026 | 06:28 AM

పాలనలో ఎలాం టి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

  • తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి

  • అధికారుల పనితీరును ప్రజలకే చెప్తా: సీఎం

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పాలనలో ఎలాం టి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం ఆర్టీజీఎస్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగులందరి పనితీరు ను ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని, పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, సరిగా లేని వా రిని గాడిలో పెడతామని తెలిపారు. ఇకపై జిల్లాల పర్యటనలలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు, ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. జిల్లాల్లోని పాల నా యంత్రాంగం కూడా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండాలని సూచించారు. తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టడమే కాకుండా ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను, అభివృద్ధిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. ప్రజలకు వాస్తవాలను స్వయంగా తానే వివరిస్తానని చెప్పారు. ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేలా వారికి అవసరమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ మేరకు అమరావతిలో రాష్ట్రస్థాయి శిక్షణ కేంద్రాన్ని, వివిధ ప్రాంతాల్లో జోనల్‌ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. కుల ధృవీకరణ పత్రాల విషయంలో పొరపాట్లకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Updated Date - Apr 01 , 2026 | 06:28 AM