రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం: ఎంపీ సీఎం రమేష్
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:57 PM
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రతి తెలుగువాడి గుండె చప్పుడని ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. రాజధాని అంటే భవనం కాదు.. గౌరవం అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందని పేర్కొన్నారు. బుధవారం లోక్సభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా ఎంపీ సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ‘అమరావతి చట్టబద్ధతకు మోదీ, అమిత్షా, చంద్రబాబు, పవన్ సహకరించారు. ఈ బిల్లు ఏపీకి అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తుంది. అమరావతిని నాశనం చేసేందుకు జగన్ ఎంతో ప్రయత్నించారు’..
‘ఇకపై పులివెందుల ఎమ్మెల్యే అమరావతిలో మూడు ముక్కలాట ఆడలేరు.. ఇకపై ఊసరవెల్లిలా రంగులు మార్చలేరు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ తన అరాచకం మొదలు పెట్టారు. ఐదేళ్లలో జగన్ చేసిన అరాచకాన్ని ప్రజలు భరించలేకపోయారు. మూడు ముక్కలాటతో కాలక్షేపం చేశారు తప్ప.. అభివృద్ధి చేయలేదు. రైతుల నిరసనలపై రాక్షసంగా ప్రవర్తించారు. శాశ్వత రాజధానితో ఏపీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉంటే డబ్బుకు కొరత ఉండదు!