ఏ గన్ వచ్చినా అమరావతిని కదపలేరు: సుజనా
ABN , Publish Date - Apr 05 , 2026 | 05:35 AM
‘మావిగన్ కాదు.. ఏ గన్ వచ్చినా అమరావతిని కదిలించలేరు. జగన్కు స్ర్కిప్ట్ ఎవరిచ్చారో తెలియ దు కానీ ఇది రాజకీయంగా ఆయనకు పెద్దనష్టం..
విజయవాడ అర్బన్, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): ‘మావిగన్ కాదు.. ఏ గన్ వచ్చినా అమరావతిని కదిలించలేరు. జగన్కు స్ర్కిప్ట్ ఎవరిచ్చారో తెలియ దు కానీ ఇది రాజకీయంగా ఆయనకు పెద్దనష్టం కలిగిస్తుంది’ అని బీజేపీ ఎమ్మెల్యే సుజనాచౌదరి అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించటంలో, అమరావతి ఉద్యమ సమయంలో సుజనా చౌదరి అండగా నిలిచినందుకు అమరావతి రైతులు శనివారం కానూరులోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.