ఇన్వెస్టర్లను భయపెట్టేందుకే ‘మావిగన్’: ఏబీవీ
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:58 AM
‘అమరావతికి జగన్ వ్యతిరేకం. దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించారు’ అని విశ్రాంత ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ కన్వీనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
విజయవాడ(గాంధీనగర్), ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): ‘అమరావతికి జగన్ వ్యతిరేకం. దానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్నీ సృష్టించారు’ అని విశ్రాంత ఐపీఎస్ అధికారి, సెంటర్ ఫర్ లిబర్టీ కన్వీనర్ ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని జీర్ణించుకోలేని జగన్ ‘మావిగన్’ వంటి వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతిని నాశనం చేస్తానని ఇన్వెస్టర్లను హెచ్చరించేందుకే జగన్ ‘మావిగన్’ను ప్రతిపాదించారు. ఈ ఆంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పత్రికలపై రాద్ధాంతం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు మద్దతునివ్వడం దురదృష్టకరం. అమరావతికి రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు అవుతుందని తప్పుదారి పట్టిస్తున్న జగన్... ఏలా ఖర్చువుతుందో వివరించాలి’’ అని ఏబీవీ డిమాండ్ చేశారు.