UN Report: సొంత ఇల్లే మహిళలకు మరణాంతకం.. ప్రతి 10 నిమిషాలకు ఒక హత్య!
ABN , Publish Date - Nov 27 , 2025 | 10:04 AM
కంచే చేను మేస్తే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు ప్రపంచంలో మహిళలు, బాలికల స్థితి. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టులో హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డొమెస్టిక్ వయలెన్స్ ఎంత తీవ్రంగా ఉందో ఆ నివేదికలు బయటపెట్టాయి.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికలపై జరిగే హింస భయానకరూపం దాల్చుతోంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, UN విమెన్స్ డివిజన్ సంయుక్తంగా విడుదల చేసిన తాజా రిపోర్టులో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. తమ సొంత ఇల్లే ఆడవాళ్లకు అత్యంత ప్రమాదకరమైన స్థలంగా మారుతోందన్న విషయం నివేదికలు చెబుతున్నాయి.
ఈ రిపోర్టు ప్రకారం గతేడాది 83,000 మంది మహిళలు, బాలికలు హత్యకు గురయ్యారని సదరు నివేదిక వెల్లడి చేస్తోంది. ఇందులో 60% (సుమారు 50,000 మంది)ఆడవాళ్లు.. తమ భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారట.
ఇది.. సగటున ప్రతి 10 నిమిషాలకు ఒక మహిళ హత్య అవుతున్నట్టు నిర్ధారిస్తోంది. రోజుకు 137 మరణాలు మహిళలపై డొమెస్టిక్ వయోలెన్స్ తీవ్రతను చాటి చెబుతున్నాయి. పురుషుల హత్యలలో కుటుంబ సభ్యులు కేవలం 11 శాతం కారణమవుతుంటే, మహిళల విషయంలో ఇది 60 శాతంగా ఉంది.
ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం, గృహ హింసలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, ఓషియానియా దేశాలున్నాయి. ఆసియాలో 0.7, యూరప్‌లో 0.5 మరణాల రేటు ఉన్నప్పటికీ, భారతదేశంలో ఇది ప్రతి లక్ష మంది మహిళలకు ఐదుగురు ఈ రకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆ రిపోర్టులు తేల్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..
మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..
Read Latest Telangana News and National News