Jupalli Krishna Rao: పర్యాటకంలో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:09 AM
తెలంగాణలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముంబైలో జరిగిన హోటల్స్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సులో తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు

ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు: జూపల్లి
హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆతిథ్య రంగంలో తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానంతో తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని చెప్పారు. గురువారం ముంబై పోవై లేక్‌లో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్స్ ఇన్వె్‌స్టమెంట్ సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రఖ్యాత హోటల్స్, ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై తెలంగాణ ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టి పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆహ్వానించారు.