Share News

Bhatti Vikramarka: పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం

ABN , Publish Date - Jul 17 , 2025 | 03:53 AM

పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Bhatti Vikramarka: పరిశ్రమల స్థాపనకు తెలంగాణ అనుకూలం

  • ఫ్రాన్స్‌ బృందానికి వివరించిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సచివాలయంలో భట్టి విక్రమార్కతో ఫ్రాన్స్‌ కాన్సుల్‌ జనరల్‌ మార్క్‌ లేమి బృందం బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం ఆ బృందానికి పరిశ్రమల స్థాపన గురించి వివరించారు. రాష్ట్రంలోని మానవ వనరులు, వాతావరణం, ప్రభుత్వ విధానాలు తదితర అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 03:53 AM