Duddilla Sridhar Babu: తెలంగాణ ఫీనిక్స్ పక్షిలా ఎగిరింది
ABN , Publish Date - Jul 25 , 2025 | 05:02 AM
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

18 నెలల్లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
పారిశ్రామికాభివృద్ధికి అపార అవకాశాలు
‘ఇన్వెస్టోపియా గ్లోబల్’లో మంత్రి దుద్దిళ్ల
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనేదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనలో పాలుపంచుకోవాలని యూఏఈ పారిశ్రామికవేత్తలను కోరారు. గురువారం హెచ్‌ఐసీసీలో యూఏఈ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ‘ఇన్వెస్టోపియా గ్లోబల్’ సదస్సును ఆయన ప్రారంభిస్తూ ‘భౌగోళికంగా చిన్నదైనా, ఆశయాలు, ఆచరణలో మాత్రం తెలంగాణ చాలా పెద్దది. స్వల్ప కాలంలోనే ఫీనిక్స్ పక్షిలా ఎగిరి ఇతర రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమంలో ఆదర్శంగా నిలిచింద’ని అన్నారు. 2024-25లో జీఎ్‌సడీపీలో 8.2 శాతం వృద్ధి నమోదైందని, ఇది జాతీయ సగటు (7.6ు) కంటే ఎక్కువని చెప్పారు.
రాష్ట్రంలో డ్రై పోర్టులు, మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు నెట్-జీరో పారిశ్రామిక పార్కులు, ఈవీ జోన్లు, గ్రీన్ లాజిస్టిక్స్ హబ్‌లు, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్), మెట్రో ఫేజ్-2 తదితరాలు పారిశ్రామికాభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇవ్వనున్నాయని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబోతున్న ఫ్యూచర్ సిటీ.. ఆవిష్కరణలకు ప్రపంచ కేంద్రంగా మారబోతోందన్నారు. 2024-25లో యూఏఈకి తెలంగాణ ఎగుమతులు 2.5 రెట్లు పెరిగాయన్నారు. ఫార్మా, ఏరోస్పేస్, డిజిటల్ సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ కీలక పాత్ర పోషించాయని తెలిపారు. కార్యక్రమంలో యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్, టీజీఐఐసీ ఎండీ కే శశాంక, యుఏఈ పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో చేపట్టిన సర్వే దేశానికి ఆదర్శం కావాలి: ఖర్గే
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఐటీ అధికారుల సోదాలు
Read latest Telangana News And Telugu News