kumaram bheem asifabad- పీవీటీజీల అభివృద్ధికి చర్యలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 10:42 PM
ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహరాల కార్యదర్శి విభూనాయర్ అన్నారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం, ఆధీక్మయోగి పథకం అమలుపై గురువారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధీకర్మయోగి పథకంపై గిరిజనుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు.

ఆసిఫాబాద్, జూలై 24(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ వ్యవహరాల కార్యదర్శి విభూనాయర్ అన్నారు. ప్రధాన మంత్రి జన్ మన్ పథకం, ఆధీక్మయోగి పథకం అమలుపై గురువారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధీకర్మయోగి పథకంపై గిరిజనుల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు గ్రామైక్య సంఘ సభ్యులు, కుల సంఘాల పెద్దలు, స్వచ్ఛంద సంస్థలతో ఆదివాసీ గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ప్రధాన మత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాలలో సేవలు కల్పించాలని సూచించారు. జిల్లా కేంద్రలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో వీసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులతో కలిసి హారజయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన్‌మన్ పథకం కింద పీవీటీజీ గ్రామాలలో 23 కమ్యూనిటీ మల్లీపర్పస్ సెంటర్ల నిర్మాణాలకు చర్యలు తీసుకుంటామని, పీవీటీజీల కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీవీటీజీ గిరిజన గ్రామాలలో 8 రహదారుల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, నాలుగు వసతి గృహాల పనులు కొనసాగుతున్నాయని, ప్రతి ఇంటికి సిద్దమైన తాగునీరు. విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందని తెలిపారు. పది మొబైల్ యూనిట్ల ద్వారా వైద్య సేవలు అందించం జరుగుతుందని, 33 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పీవీటీజీ గ్రామంలో మొబైల్ సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, సంక్షేమాధికారి భాస్కర్, డీఎంఅండ్‌హెచ్‌ఓ సీతారాం, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.