Samantha Raj Nidimoru Marriage: పెళ్లి చేసుకున్న సమంత, రాజ్
ABN , Publish Date - Dec 01 , 2025 | 01:52 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న సమంత రాజ్ ఈ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu), దర్శకుడు రాజ్ నిడమోరు పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్న వీరిరువురు ఈ ఉదయం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కోయంబత్తూరు (Coimbatore) లోని సద్గురు జగ్గీ వాసుదేవ్ (Sadguru) ఇషా పౌండేషన్ యోగా సెంటర్ (Isha Yoga Centre)లో సమంత, రాజ్ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సమంత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే, రాజ్ మొదటి భార్య శ్యామలి సోషల్ మీడియాలో వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెగించిన వారు ఇలాంటి పనులే చేస్తారని చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా, సమంత గతంలో హీరో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి, పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, కొన్ని సంవత్సరాలకే వీళ్లు మనస్పర్థలు వచ్చి విడిపోయారు. ఇటీవల చైతన్య రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. చై నుండి విడిపోయిన సామ్ డైరెక్టర్ రాజ్‌తో ఏడాదిగా పైగా డేటింగ్‌లో ఉంటూ ఇవాళ ఉదయం వివాహ బంధంతో ఒకటయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జాక్‌పాట్ కొట్టనున్న ఈ రాశులు.. పట్టిందల్లా బంగారమే..!