Woman Driver: విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తా
ABN , Publish Date - Jun 18 , 2025 | 06:18 AM
విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తానని ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ వాంకుడోతు సరిత నాయక్ అన్నారు. విధుల్లో చేరడానికి మంగళవారం మిర్యాలగూడకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు.

ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ సరిత
మిర్యాలగూడ టౌన్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తానని ఆర్టీసీ తొలి మహిళా డ్రైవర్ వాంకుడోతు సరిత నాయక్ అన్నారు. విధుల్లో చేరడానికి మంగళవారం మిర్యాలగూడకు వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన తాను ఆటో, క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశానని, ఢిల్లీలో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌లో పనిచేసినట్లు తెలిపారు.
కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఇటీవల ‘ప్రజావాణి’లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు ఫోన్ చేసి ఉద్యోగం ఇప్పించారన్నారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన మంత్రులకు, ఆర్టీసీ సంస్థకు సరిత ధన్యవాదాలు తెలిపారు.