Ramoji Excellence Awards: రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్.. ఒకే వేదికపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:09 AM
ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం జరగనుంది. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేయనున్నారు.
ప్రతిష్టాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు రాంమోహన్ నాయుడు, కిషన్ రెడ్డిలు పాల్గొననున్నారు. జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డులను ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ నిఘంటువులను కూడా విడుదల చేయనున్నారు.
సీఎం చంద్రబాబు ఘన నివాళి..
రామోజీ రావు జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘తెలుగు వెలుగు పద్మవిభూషణ్ రామోజీ రావు జయంతి సందర్భంగా ఘననివాళులు. నిష్పక్షపాత జర్నలిజానికి నూతన ప్రమాణాలు ఏర్పరచి, ఈనాడు సంస్థల ద్వారా సమాజంపై అపూర్వమైన ప్రభావం చూపిన మహనీయుడు ఆయన. వ్యాపారాల్లోనూ ప్రజాహితం, విలువలు, నైతికతను ప్రతిష్టించిన అరుదైన దూరదృష్టి కలిగిన వ్యక్తి రామోజీ. ఆయన జయంతి సందర్భంగా రామోజీ చూపిన మార్గాన్ని శాశ్వత స్ఫూర్తిగా మలచుకుందాం’ అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీ పేలుడు.. కారు డ్రైవర్‌కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు..
ఊరి కోసం ... వాగుపై వారధి కట్టాడు..