Ponguleti: తల తాకట్టు పెట్టైనా ఇందిరమ్మ ఇళ్లకు నిధులిస్తాం
ABN , Publish Date - Jul 22 , 2025 | 04:28 AM
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం:పొంగులేటి
భూపాలపల్లి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలున్నా లెక్క చేయబోమని, తలతాకట్టు పెట్టైనా నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లాలోని కొత్తపల్లిగోరి, గణపురం, భూపాలపల్లి మండలాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో పొంగులేటి మాట్లాడుతూ భూపాలపల్లికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ కోరిక మేరకు మరో 700 ఇళ్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు.
వైఎ్‌స స్ఫూర్తితో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గత ప్రభుత్వం 8.19లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిందని దుయ్యబట్టారు. తమది పేదల ప్రభుత్వమని, ఎన్ని అప్పులున్నా.. సంక్షేమ పథకాలను ఆగనివ్వబోమని పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు కాంగ్రె్‌సను ఆశీర్వదించాలని కోరారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో కొత్తగా 5వేల రేషన్ కార్డులను జారీ చేశామని, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 15 వేల మంది కొత్త సభ్యులను చేర్చామని గుర్తు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News