పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:17 AM
మొక్క లు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకానికి త మ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధి కల్పన, గ నుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపా రు.

మంత్రి వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : మొక్క లు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాలని, అడవుల సంరక్షణ, మొక్కల పెంపకానికి త మ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఉపాధి కల్పన, గ నుల, కార్మిక శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపా రు. శనివారం పట్టణంలోని వెంకటేశ్వర్ టెంపుల్ ఏరి యా కోల్‌బెల్ట్ రోడ్డు పక్కన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి మం త్రి హాజరయ్యారు. మున్సిపల్ కమీషనర్ రాజలింగుతో కలిసి మొక్కలు నాటారు. మంత్రి మాట్లాడుతూ మాన వాళి మనుగడ మొక్కలతోనే ముడిపడి ఉందన్నారు. రాష్ట్రంలో మొక్కల పెంప కానికి ప్రాధాన్యత ఇస్తున్నామ న్నారు. నర్సరీల్లోని మొక్కలను సంరక్షించి నాటాల న్నా రు. ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటి వాటిని సంర క్షించాలని సూచించారు. కాలుష్య నివారణ, స్వచ్చమైన గాలి చెట్లతోనే సాధ్యమవుతుందన్నారు. మందమర్రి మున్సిపాలిటీలో మొక్కలు నాటి సంరక్షించాలని కమీష నర్‌కు సూచించారు. అనంతరం మంత్రిని డ్వాక్రా గ్రూ పు మహిళలు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా శాలువాలతో సన్మానించారు. అనంతరం పలువురు స మస్యలపై వినతి పత్రాలు అందించారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.