Share News

Operation Sindoor: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్లపై నిషేధం

ABN , Publish Date - May 10 , 2025 | 05:16 PM

శంషాబాద్ విమానాశ్రయానికి పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించడంపై నిషేధం విధించినట్టు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. జూన్ 9 వరకు ఈ నిషేధం విధించినట్టు సీపీ వెల్లడించారు.

Operation Sindoor: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలో డ్రోన్లపై నిషేధం
ShamShabad Airport

భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం (ShamShabad Airport) పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు (Drones). శంషాబాద్ విమానాశ్రయానికి పది కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను ఉపయోగించడంపై నిషేధం విధించినట్టు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. జూన్ 9 వరకు ఈ నిషేధం విధించినట్టు సీపీ వెల్లడించారు (Operation Sindoor).


డ్రోన్ల వినియోగంతో పాటు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడంపై కూడా నిషేధం విధించినట్టు హైదరాబాద్ సీవీ మహంతి తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడంపై నిషేధం విధించారు. ఆకస్మిక శబ్దాలు, భారీ ధ్వనులతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయవద్దని సూచించారు. ఈ నిబంధనలను ప్రజలందరూ అర్ధం చేసుకుని పాటించాలని, ఒకవేళ ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకోక తప్పదని హెచ్చరించారు.

Updated Date - May 10 , 2025 | 05:16 PM