Nalgonda Accident: డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీ కొట్టిన ఇన్నోవా.. పూర్తిగా దగ్ధం
ABN , Publish Date - Nov 08 , 2025 | 08:14 AM
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఆక్షణమే ఇంజన్ లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది.
నల్గొండ, నవంబర్ 8: తెలంగాణలోని నల్గొండ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఇన్నోవా కారు యూటర్న్ వద్ద డివైడర్ ను ఢీ కొట్టి పల్టీ కొట్టింది. ఆ క్షణమే ఇంజన్ మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, వెంటనే మంటలను ఆర్పివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు కారులో నుంచి సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డుకు కారు అడ్డంగా పడిపోవడంతో హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది.
ఇవి కూడా చదవండి:
CM Revanth Reddy accused KTR and Kishan Reddy: కిషన్‌రెడ్డి, కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్
Central Minister G Kishan Reddy: వారి వ్యూహం.. ఓట్ల కొనుగోళ్లే