Share News

MLA Raja Singh: ఆ వార్తల్లో నిజం లేదు.. బీజేపీలోకి మళ్లీ వెళ్లను

ABN , Publish Date - Jul 27 , 2025 | 09:27 PM

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ బీజీపీలోకి వెళ్లటంపై మరో సారి స్పష్టత ఇచ్చారు. మళ్లీ వెనక్కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు.

MLA Raja Singh: ఆ వార్తల్లో నిజం లేదు.. బీజేపీలోకి మళ్లీ వెళ్లను
MLA Raja Singh

గోశామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజీపీలోకి తిరిగి వెళ్లటంపై మరో సారి స్పష్టత ఇచ్చారు. మళ్లీ వెనక్కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని స్పష్టం చేశారు. తాను మళ్లీ బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు. తనకు అమిత్ షా ఫోన్ చేయలేదని తెలిపారు. అమిత్ షా ఫోన్ చేసేంత పెద్ద వ్యక్తిని తాను కానని అన్నారు. బీజేపీలో అవమానాలు చూశాకనే బయటకు వచ్చానని చెప్పారు. ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ..


అమిత్ షా నాకు ఫోన్ చేయలేదు. తెలంగాణ బీజేపీలో జరుగుతున్న తప్పులను కేంద్రానికి లేఖ రాశా. మెయిల్స్ కూడా చేశాను. హైకమాండ్ దృష్టికి వెళ్లిందో లేదో కూడా తెలీదు. బేగంపేట ఎయిర్ పోర్టులో అమిత్ షాను కలుస్తానని చెప్పా. ఇంతలోనే రాజీనామా చేశా. నాకు అమిత్ షా ఫోన్ చేశారని యూట్యూబ్‌ ఛానళ్లలో ఫేక్ వార్తలు పెట్టి రాజీనామా ఆమోదించేలా చేశారు. ఫేక్ వార్తలు, మీడియాలో లీకులు ఇవ్వటం నాకు అలవాటు లేదు. అలాంటి చిన్న ఆలోచనలు నేను చేయను’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

రెచ్చిపోయిన సైకో.. సూపర్ మార్కెట్‌లోని జనంపై కత్తి దాడి

మామ, అల్లుడి గొడవ.. ఆపడానికి వెళ్లిన కానిస్టేబుల్‌పై దారుణం..

Updated Date - Jul 27 , 2025 | 09:31 PM