Vivek Venkataswamy: వారానికి 48 గంటల పని విధానాన్ని మార్చలే
ABN , Publish Date - Jul 10 , 2025 | 03:31 AM
కార్మికుడికి రోజులో 8 పనిగంటలు మాత్రమే ఉండాలన్న అంశంలో మాత్రమే వెసులుబాటు ఇచ్చామని, వారంలో 48కి మించి పనిగంటలు ఉండొద్దన్న నిబంధన మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు.

రోజులో పనిగంటల విషయంలోనే వెసులుబాటు: వివేక్
కార్మికుడికి రోజులో 8 పనిగంటలు మాత్రమే ఉండాలన్న అంశంలో మాత్రమే వెసులుబాటు ఇచ్చామని, వారంలో 48కి మించి పనిగంటలు ఉండొద్దన్న నిబంధన మాత్రం యథాతథంగా కొనసాగుతుందని కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయం.. క్రమంగా కార్మికులకు వారానికి రెండు రోజుల సెలవు విధానం వైపునకు దారి తీస్తోందన్నారు.
కార్మికుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రోజుకు 10 గంటల పని విధానంపై వస్తున్న విమర్శలపై ఈ మేరకు స్పందించారు. రోజుకు 10 గంటల పని విధానం.. మ్యానిఫ్యాక్చరింగ్ సెక్టార్‌కు (యంత్రాలపైన పనిచేసే కార్మికులకు) వర్తించబోదని స్పష్టం చేశారు.