Share News

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:37 AM

దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు..! ‘ఆపరేషన్‌ కగార్‌’తో చతికిలపడి.. నక్సలిజం, ఆ తర్వాత మావోయిజం చరిత్రలోనే ఎన్‌కౌంటర్‌లో ప్రధాన కార్యదర్శి(నంబాల కేశవరావు)ని కోల్పోవడానికి కారకులైన ఇన్ఫార్మర్లపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.

Maoist Revenge: టార్గెట్‌ ఇన్ఫార్మర్‌

  • మావోయిస్టుల ప్రతీకారేచ్ఛ

  • వారంలో ఆరుగురు గిరిజనుల హత్య

చర్ల, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): దండకారణ్యంలో మావోయిస్టులు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు..! ‘ఆపరేషన్‌ కగార్‌’తో చతికిలపడి.. నక్సలిజం, ఆ తర్వాత మావోయిజం చరిత్రలోనే ఎన్‌కౌంటర్‌లో ప్రధాన కార్యదర్శి(నంబాల కేశవరావు)ని కోల్పోవడానికి కారకులైన ఇన్ఫార్మర్లపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. అడవుల్లో వర్షాలు కురుస్తుండడంతో.. పోలీసుల కూంబింగ్‌ తగ్గింది. దీంతో.. ఇన్ఫార్మర్లపై దృష్టి సారించారు. గడిచిన వారం రోజుల్లో ఆరుగురు గిరిజనులను హతమార్చారు. దీంతో ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌ ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మావోయిస్టులు హతమార్చిన గిరిజనులు 4 గ్రామాలకు చెందిన వారు. వీరిలో బీజాపూర్‌ జిల్లా పెద్దకొర్మాకి చెందిన సోనుల్‌, జంగు, అనిల్‌ ఒకే కుటుంబానికి చెందినవారు. యాంపురం, సండ్రంబోరు గ్రామాలకు చెందిన దేవా, సమయ్య, తాజాగా మంగళవారం కంచాల గ్రామానికి చెందిన లక్ష్మణ్‌ను మట్టుబెట్టారు. పెద్దకొర్మాలో సోనుల్‌, జంగు, అనిల్‌ను హతమార్చడంపై మావోయిస్టుపార్టీ గంగలూరు ఏరియా కమిటీ పేరుతో మంగళవారం ఓ లేఖ విడుదలైంది. ‘‘అన్యాయంగా ఎవరినీ చంపడం లేదు. పోలీసులకు సమాచారం ఇవొవ్వద్దని జంగు కుటుంబానికి ఐదుసార్లు కౌన్సెలింగ్‌ ఇచ్చాం. అయినా పోలీసులకు సమాచారం అందజేశారు. అందుకే ప్రజాకోర్టులో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని కమిటీ ఆ లేఖలో పేర్కొంది.

Updated Date - Jun 25 , 2025 | 04:40 AM