Share News

Bhupalpally: ధాన్యం బస్తాలో లక్షన్నర దాచిన భర్త .. భార్య ఏం చేసిందంటే..

ABN , Publish Date - May 18 , 2025 | 11:38 AM

Bhupalpally News: అయితే, కారణం ఏంటో తెలీదు కానీ.. భార్యకు ఈ విషయం చెప్పలేదు. బుధవారం విడి ధాన్యం కొనుక్కోవడానికి ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. వీరయ్య భార్య ఇంట్లోని ధాన్యాన్ని ఆ వ్యాపారికి అమ్మేసింది. డబ్బులు ఉన్న బస్తాను కూడా ఆ వ్యాపారికి అమ్మింది.

Bhupalpally: ధాన్యం బస్తాలో లక్షన్నర దాచిన భర్త .. భార్య ఏం చేసిందంటే..
Bhupalpally News

మంచో.. చెడో భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం ఉండకూడదు. ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే.. బంధం దెబ్బ తినటమే కాదు.. కొన్ని సార్లు ఆర్థికంగా కూడా నష్టపోవాల్సి వస్తుంది. ఇందుకు తెలంగాణలో జరిగిన ఓ తాజా సంఘటనే ఓ ప్రత్యక్ష ఉదాహరణ. ఓ భర్త తన భార్యకు తెలియకుండా.. ధాన్యం బస్తాలో లక్షకుపైగా డబ్బులు దాచాడు. ఆ బస్తాలో డబ్బులు ఉన్నాయని తెలియని భార్య దాన్ని అమ్మేసింది. దీంతో భర్త లబోదిబోమన్నాడు. ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గ్యాప్‌తో కొంప కొల్లేరు అయింది.


సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య కొన్ని రోజుల క్రితం తన ఎద్దులను అమ్మాడు. ఎద్దుల్ని అమ్మగా వచ్చిన డబ్బుల్ని ఇంట్లోని ఓ ధాన్యం బస్తాలో దాచాడు. అయితే, కారణం ఏంటో తెలీదు కానీ.. భార్యకు ఈ విషయం చెప్పలేదు. బుధవారం విడి ధాన్యం కొనుక్కోవడానికి ఓ వ్యాపారి వాహనంలో గ్రామానికి వచ్చాడు. వీరయ్య భార్య ఇంట్లోని ధాన్యాన్ని ఆ వ్యాపారికి అమ్మేసింది. డబ్బులు ఉన్న బస్తాను కూడా ఆ వ్యాపారికి అమ్మింది.


ఆ సమయంలో వీరయ్య ఇంట్లో లేడు. వీరయ్య బయట పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంట్లో ధాన్యం బస్తాలు కనపడలేదు. ధాన్యం బస్తా గురించి భార్యను అడిగాడు. దాన్ని ఓ వ్యాపారికి అమ్మేసినట్లు తెలిపింది. అంతే.. వీరయ్య గుండెలు ఝల్లుమన్నాయి. వెంటనే ఆ ప్యాపారి కోసం ఊరంతా వెతికాడు. అతడు ఎక్కడా కనిపించలేదు. దీంతో చేసేది ఏమీ లేక భార్యాభర్తలిద్దరూ శనివారం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యాపారి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

Pakistan Peace Delegation: భారత్‌ను కాపీ కొడుతున్న పాక్.. తప్పుడు ప్రచారాలకు తెర..

Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..

Updated Date - May 18 , 2025 | 12:11 PM