Share News

Koppula Eswar Book: కొప్పుల ఈశ్వర్‌ ఒక ప్రస్థానం పుస్తకావిష్కరణ నేడు

ABN , Publish Date - Apr 20 , 2025 | 05:11 AM

కొప్పుల ఈశ్వర్‌ జీవితంపై ‘ఒక ప్రస్థానం’ అనే పుస్తకం ఆదివారం జలవిహార్‌లో ఆవిష్కరించబడుతుంది. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు

Koppula Eswar Book: కొప్పుల ఈశ్వర్‌ ఒక ప్రస్థానం పుస్తకావిష్కరణ నేడు

  • ఆవిష్కరించనున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత కొప్పుల ఈశ్వర్‌ జీవితంపై ‘ఒక ప్రస్థానం’ పేరిట పుస్తకావిష్కరణ జరగనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జలవిహార్‌లో జరిగే కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. మాజీ మంత్రి టి. హరీ్‌షరావు ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు. సీపీఐ ఎంఎల్‌ అనుబంధంగా ఏర్పాటు చేసిన గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యుల్లో ఈశ్వర్‌ ఒకరు. తొలుత తెలుగుదేశం పార్టీలో చేరి ఎన్టీఆర్‌ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2004 నుంచి ఈశ్వర్‌ వరుసగా ఆరుసార్లు (ఒక ఉప ఎన్నికతో కలిపి)ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వివిధ కేసుల్లో ఆరుసార్లు జైలుకు వెళ్లారు.

Updated Date - Apr 20 , 2025 | 05:11 AM