Share News

IT Raids: ఆంధ్ర, తెలంగాణలో ఐటీ సోదాలు

ABN , Publish Date - Jul 15 , 2025 | 03:54 AM

నకిలీ (బోగస్‌) క్లెయిమ్‌లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ముగ్గురి వ్యక్తుల ఇళ్లల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.

IT Raids: ఆంధ్ర, తెలంగాణలో ఐటీ సోదాలు

నకిలీ (బోగస్‌) క్లెయిమ్‌లకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన ముగ్గురి వ్యక్తుల ఇళ్లల్లో ఆదాయ పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతికి చెందిన చైతన్య, ఒంగోలుకు చెందిన శ్రీనివాస్‌, నిజాంపేట వాసి పురుషోత్తం తమ ఆదాయ పన్ను రిటర్నులలో ఉత్తరాదికి చెందిన కొన్ని రాజకీయ పార్టీలకు భారీ మొత్తంలో విరాళాలు ఇచ్చినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారని ఐటీ అధికారులు గుర్తించారు. పన్ను మినహాయింపు పొందే ఉద్దేశంతో వీరు బోగస్‌ క్లెయిమ్‌లకు పాల్పడినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ సోదాల్లో భాగంగా పలు కీలక పత్రాలు, డిజిటల్‌ డేటాను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 03:54 AM