Share News

Inter Results 2025: గెట్ రెడీ.. మరికొన్ని గంట్లో ఇంటర్ రిజల్ట్స్..

ABN , Publish Date - Apr 21 , 2025 | 09:49 PM

Inter Results: మంగళవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. 9.5 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు రేపు తేలనుంది.

Inter Results 2025: గెట్ రెడీ.. మరికొన్ని గంట్లో ఇంటర్ రిజల్ట్స్..
Inter Results

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు(మంగళవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఫస్ట్ ఇయర్‌తో పాటు సెకండియర్ ఫలితాలు కూడా విడుదల కానున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల విడుదల కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొననున్నారు. ఇక, మార్చి 5 నుంచి 25 వరకు జరిగిన పరీక్షలకు 9.5 లక్షల మందికి పైగా హాజరయ్యారు. రేపు వీరి భవిష్యత్తు తేలనుంది.


ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..

1) ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ tgbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయండి.

2 ) ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ట్యాబుపై క్లిక్ చేయండి.

3) మీ హాల్ టికెట్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.

4) ఫలితాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.

5) వాటిని ప్రింట్ తీసుకోవచ్చు.


ఇవి కూడా చదవండి

Court Movie Fame Jabilli: దేవుడి మొక్కు.. రెండు వారాల్లోనే సినిమా ఛాన్స్

Actress Mrunal Thakur: తన ప్రేమ గురించి చెప్పిన మృణాల్ ఠాకూర్

Updated Date - Apr 21 , 2025 | 09:51 PM