Share News

BRS Party: బీఆర్ఎస్‌కు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా

ABN , Publish Date - Aug 04 , 2025 | 06:03 PM

బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గువ్వల బాలరాజుతో పాటు మరో ఇద్దరు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు.

BRS Party: బీఆర్ఎస్‌కు ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా

హైదరాబాద్, ఆగస్టు 4: బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గువ్వల బాలరాజుతో పాటు మరో ఇద్దరు రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు. గువ్వల బాలరాజు బీజేపీలో ఈ నెల 9న చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడితో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం.


తాజాగా గువ్వలత బాలరాజు ఓ కార్యకర్తతో ఫోన్ కాల్ మాట్లాడినట్లు సమాచారం. అయితే ఫోన్ కాల్లో బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని అనే వార్తులు వస్తున్నాయి.. అలాంటప్పుడు అభ్యర్థిత్వం ఎగిరిపోతుందని మాట్లాడారు. గతంలో బీజేపీతో పోరాటం చేసిన వాడినని అన్నారు. బీఆర్ఎస్(BRS) కంటే ముందే తన దారి తను చూసుకుని.. బీజేపీ(BJP)లో కలవడం మంచిదని నిర్ణయం తీసుకున్నట్లు కార్యకర్తకు చెప్పుకొచ్చారు. పార్టీలో తనను కాదని నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇవ్వడంపై కూడా ఫోన్‌లో చర్చించారు. ఏది ఎమైనా.. ఈ ఎమ్మెల్యేల రాజీనామాలతో బీఆర్ఎస్ పార్టీ వేర్లు బలహీనపడటం ఖాయమని అనిపిస్తోంది.


గులాబీ నుంచి కాషాయం వైపు..

మరోవైపు ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే అబ్రహం అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరోసారి రాజీనామా బాట పట్టారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో అబ్రహం కూడా కాషాయ జెండా కప్పుకోనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్న ABNతో చెప్పారు. ఏ పార్టీలో చేరుతాననే దానిపై క్లారిటీ ఇస్తానని అన్నారు. అయితే జనార్దన్ రెడ్డి కూడాకమలం పార్టీలో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఒకవైపు కూతురు ఎమ్మెల్సీ కవితతో రాజకీయ పంచాయతీ.. మరోవైపు పార్టీ నేతల ఫిరాయింపులతో ఇక్కట్లు పడుతున్న కేసీఆర్ కు ఇది భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. రాజీనామాలపై బీఆర్ఎస్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


ఈ వార్తలు కూడా చదవండి..

అరెస్ట్ చేయొచ్చు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

వారిపై చర్యలకు కాళేశ్వరం కమిషన్ కీలక సిఫార్స్

Updated Date - Aug 04 , 2025 | 07:04 PM