Share News

Kavitha Comments On BRS: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:31 AM

బీఆర్ఎస్ పార్టీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఒక లిల్లీపుట్ అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని కుండబద్దలు కొట్టారు.

Kavitha Comments On BRS: ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
MLC Kavitha

హైదరాబాద్, ఆగస్టు 3: ఎమ్మెల్సీ కవిత తరుచు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. జగదీష్ ఒక లిల్లీపుట్ అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు.


నీచంగా మాట్లాడుతారా?

జగదీష్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండలో బీఆర్‌ఎస్‌ను నాశనం చేసిందే జగదీష్‌రెడ్డి అని విరుచుకపడ్డారు. నా మీద నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అని ఆవేదన వ్యక్తం చేశారు. నా తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశారని అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులే.. నాపై అనుచితంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. కాగా ఇటీవల ఒక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలకు ఈరోజు కవిత కౌంటర్ ఇచ్చారు.


ఇవీ చదవండి:

వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..

తన సీటులో మహిళ కూర్చుందని.. రెచ్చిపోయి అందరి ముందూ..

Updated Date - Aug 04 , 2025 | 05:36 PM