BREAKING: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 09:51 AM
Ponnam: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు ఖరాకండిగా చెప్పారు.

హైదరాబాద్, జులై 29: జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఫోకస్ పెంచాయి. త్వరలో రానున్న ఉప ఎన్నికకు అన్ని పార్టీలు సిద్ధం అయ్యాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై (Jubliee Hills Byelection) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో స్థానికులకే టికెట్ ఇవ్వనున్నట్లు ఖరాకండిగా చెప్పారు. బయట నుంచి వచ్చిన వారికి టికెట్ఇవ్వమని తేల్చి చెప్పారు. అందరి అభిప్రాయాలు తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందని అన్నారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. అయితే తమ స్థానాన్ని తామే దక్కించుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది. మాగంటి గోపినాథ్ భార్యకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని పింక్ పార్టీ అధిష్టానం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ స్థానం టికెట్ ఎవరికీ ఇస్తారనే దానిపై బీఆర్ఎస్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
కాంగ్రెస్ కు కలిసొచ్చిన ఉప ఎన్నిక...
మరోవైపు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోలేదు. కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఉప ఎన్నికలో బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన శ్రీగణేష్ గెలిచారు. ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో ఒక సీటు దక్కినట్లైంది. అయితే ఈ ఉప ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీకి ఫెవర్ గా ఉండబోతుందా? లేదా? అనేది వేచి చూడాలి. ఈ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో ఫిరోజ్ ఖాన్, అజహరుద్దీన్, నవీన్ యాదవ్, గద్దర్ కూతురు వెన్నెల అధిష్టాన పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో అధిష్టానం టికెట్ ఎవరికీ ఇస్తుందనేది చూడాలి. త్వరలో జరగనున్న ఈ ఉపఎన్నిక ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో వేచి చూడాలి.
ఇవి కూడా చదవండి
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్