Share News

వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు...!

ABN , Publish Date - Aug 03 , 2025 | 12:19 AM

వర్షాకాలం వ స్తోందంటే చాలు...మంచిర్యాల పుర ప్రజలను చేదు జ్ఞా పకాలు వెంటాడుతుంటాయి. మూడేళ్లు గడుస్తున్నా... వారి మదిలో ఇంకా రాళ్లవాగు ఉధృతి మెదులుతూనే ఉంది. 2022 జూలై 13న వరదలు మంచిర్యాల పట్టణా న్ని ముంచెత్తాయి.

వెంటాడుతున్న చేదు జ్ఞాపకాలు...!

ప్రజల మదిలో మెదులుతున్న రాళ్లవాగు ఉధృతి

-48 గంటలు నీటిలోనే ఏడెనిమిది కాలనీలు

-ఎంసీహెచ్‌కు నేటికీ పొంచి ఉన్న ప్రమాదం

-కరకట్టల నిర్మాణంతోనే పరిష్కారం

మంచిర్యాల, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం వ స్తోందంటే చాలు...మంచిర్యాల పుర ప్రజలను చేదు జ్ఞా పకాలు వెంటాడుతుంటాయి. మూడేళ్లు గడుస్తున్నా... వారి మదిలో ఇంకా రాళ్లవాగు ఉధృతి మెదులుతూనే ఉంది. 2022 జూలై 13న వరదలు మంచిర్యాల పట్టణా న్ని ముంచెత్తాయి. ఊహించని రీతిలో రాళ్లవాగు ఉ ప్పొంగి ఏడెనిమిది కాలనీలు పూర్తిగా 48 గంటలపాటు నీటిలోనే మగ్గాయి. ఆ తరువాత వరుసగా రెండేళ్లు కూ డా పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. ప్రస్తుతం వర్షా కాలం కావడం, వరదల నివారణకు ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చేదు జ్ఞాపకాలు పునరావృ తం అవుతాయేమోనన్న భయం ప్రజల్లో నెలకొంది.

పొంచి ఉన్న ముప్పు..

వరుసగా రెండేళ్లుగా కురిసిన భారీ వర్షాల కార ణం గా జిల్లా కేంద్రంలో జనజీవనం అతలాకుతలం అ యింది. అంతకు ముందు సంవత్సరం 2022 జూలై 13 న కుండపోతగా వర్షం కురవడంతో జిల్లా కేంద్రంలోని వాగులు పొంగి పొర్లి గోదావరి ఉప్పొంగింది. ఈ కా రణంగా వాగుల్లో నీరు ఎదురెక్కి నివాస గృహాల్లోకి చే రింది. అర్థరాత్రి ఒక్కసారిగా వరదలు రావడంతో ప్ర జలు తేరుకొనేలోపే కాలనీలు నీట మునిగాయి. భారీ వరదల కారణంగా ఏడెనిమిది కాలనీలు 48 గంటల పాటు నీటిలోనే మగ్గాయి. తిరిగి తరువాత సంవత్సరం జూలైలో కురిసిన వర్షాలకు మళ్లీ ఆయా కాలనీలు నీట మునిగాయి. దీంతో ముందస్తుగా ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. గత అనుభ వాలను దృష్టిలో ఉంచుకున్న అధికార యంత్రాంగం పునరావాస కాలనీలను ఏర్పాటు చేసి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

రాళ్లవాగులో మునిగిన కాలనీలు..

రెండేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గోదా వరి ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. నదిలో చేరే అవకాశం లేక రాళ్ల వా గు, తోళ్లవాగుల్లో వరదనీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి పోటు కమ్మాయి. రాళ్లవాగు బ్యాక్‌ వాటర్‌ కారణంగా జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల, రెడ్డి కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, రాంనగర్‌, ఎన్టీఆర్‌ నగర్‌, బైపాస్‌ రోడ్డు, ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో పెద్ద మొత్తంలో ఇళ్లు మొదటి అం తస్థు వరకు నీట మునిగాయి. అలాగే తోళ్లవాగు నీరు కూడా నివాస గృహాల దరిదాపుల్లోకి చేరింది. పెద్ద మొత్తంలో వరద ఇళ్లలో నడుంలోతు వరకు చేరడంతో బాధితులు కట్టుబట్టలతో బయటకు రావలసిన పరిస్థితి నెలకొంది. బాధితులను అధికారులు తెప్పలు, పడవల పై ముందస్తుగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల తరలించారు. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు గత ఆగస్టు 22, 23 తేదీలలో సర్వే జరిపి నీటి ప్రవా హాన్ని అంచనా వేశారు. కాసిపేట మండలంలోని దేవా పూర్‌లో పుట్టిన రాళ్లవాగు అటవీ ప్రాంతం గుండా ప్ర వహించి జిల్లా కేంద్రానికి చేరుకుంటుంది. స్థానిక ఆర్‌ ఆర్‌ నగర్‌, కార్మెల్‌ హైస్కూల్‌, గౌతమీనగర్‌, రెడ్డి కా లనీ, పాత మంచిర్యాల, రాంనగర్‌, ఎన్టీఆర్‌ కాలనీల మీ దుగా ప్రవహించి గోదావరిలో కలుస్తుంది. రెండేళ్ల క్రి తం జూలైలో కురిసిన వర్షాల కారణంగా రాళ్లవాగులో 139.20 మీటర్ల ఎత్తున నీరు ప్రవహించినట్లు అధికారు లు గుర్తించారు. పాత మంచిర్యాల వంతెన వద్ద 48006.35 క్యూసెక్కుల నీరు వాగు గుండా ప్రవహిం చినట్లు నిర్దారణకు వచ్చారు. అలాగే తోళ్లవాగుకు పై ఉన్న చింతల చెరువు నుంచి వరద తాకిడి పెరగడంతో సాయికుంట ప్రాంతంలోని నివాస గృహాల్లోకి నీరు చేరింది.

ఎంసీహెచ్‌కు పొంచి ఉన్న ప్రమాదం...

గోదావరి వదర కారణంగా జిల్లా కేంధ్రంలోని మా తా, శిశు సంరక్షణ కేంద్రానికి (ఎంసీహెచ్‌) నేటికీ ప్ర మాదం పొంచి ఉంది. గోదావరి సమీపంలో ఉండటం తో ప్రతియేటా వర్షాకాలంలో ఆసుపత్రి భవనం ముం పునకు గురవుతోంది. 2017-12-22న నేషనల్‌ హెల్త్‌ స్కీం పథకంలో భాగంగా 100 పడకలతో కూడిన ఎం సీహెచ్‌ నూతన ఆస్పత్రి మంజూరైంది. రూ. 17 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఆసుపత్రికి సుమారు రూ. 3 కోట్ల విలువగల అధునాతన పరికరాలు, ఇతర సామగ్రి మంజూరు కావడంతో గర్భిణులు, బాలింతలు, శిశువులు సుమారు 200 మంది వరకు చికిత్స పొందు తుంటారు. 2022 జూలైలో కురిసిన వర్షాలకు గోదావరి ఉప్పంగడంతో వరదలు ఆస్పత్రి భవనాన్ని ముంచెత్తా యి. ముందే ఊహించిన ఆస్పత్రి వైద్యులు చికిత్స పొందుతున్న రోగులను రాత్రికి రాత్రే జిల్లా ఆసుపత్రికి తరలించడంతో ప్రమాదం తప్పింది. గర్భిణులు, పిల్లల చికిత్సకు అవసరమైన ల్యాబరేటరీలు, అలా్ట్ర సౌండ్‌ ఎక్స్‌రే యంత్రాలు, ఇతర అధునాతన పరికరాలు, లేబర్‌ రూం, ఆపరేషన్‌ థియేటర్‌ కింద అంతస్థులో ఉండగా పై అంతస్థులో బాలింతలు చికిత్స పొందుతుంటారు. రో గులను భవనం నుంచి తరలించినప్పటికీ సుమారు రూ. 3 కోట్ల విలువ చేసే పరికరాలతోపాటు అత్యంత ఖరీదైన మందులు నీటిపాలయ్యాయి. ఆ తరువాత రెం డేళ్లు వరదలు రావడంతో రాత్రికి రాత్రే రోగులను అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం వర్షాకాలం కా వడంతో మళ్లీ ప్రమాదం పొంచి ఉంది.

కరకట్టల నిర్మాణమే పరిష్కారం...

మంచిర్యాల పట్టణాన్ని ముంచెత్తుతున్న వరదల ని వారణకు కరకట్టల నిర్మాణమే పరిష్కారం చూపనుం ది. రాళ్లవాగు బ్యాక్‌ వాటర్‌ కారణంగా మంచిర్యాల ప ట్టణం నీట మునుగుతుండటంతో కరకట్టల నిర్మాణా ని కి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్రల్‌ ఇచ్చింది. మంచిర్యాల ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు కృషితో కరకట్టలు మం జూరుకాగా, ఇటీవల పనులు కూడా ప్రారంభించారు. రూ. 250 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా, వచ్చే వర్షాకాలం నాటికి పూర్తయ్యే అవకాశాలు ఉన్నా యి. కరకట్టల నిర్మాణం పూర్తయితే మంచిర్యాల పట్ట ణానికి వరదల నుంచి విముక్తి లభించినట్లు అవుతోంది.

Updated Date - Aug 03 , 2025 | 12:19 AM