Share News

Car Accident: కారును గోడెక్కించేశాడు!

ABN , Publish Date - Jul 26 , 2025 | 05:37 AM

ప్రహరీ గోడపై కారు! ఏదో సినిమా చిత్రీకరణలో భాగంగా అలా పెట్టారేమో అనుకునేరు! ప్రమాదవశాత్తే జరిగింది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతూ డివైడర్‌ను ఢీకొని, అదే వేగంలో గాల్లోకి ఎగిరి..

Car Accident: కారును గోడెక్కించేశాడు!

  • మద్యం మత్తులో డ్రైవర్‌ నిర్లక్ష్యం.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న కారు

  • పల్టీలు కొట్టి గాల్లోకి లేచి ఇంటి ప్రహరీపైకి.. పరారీలో డ్రైవర్‌

  • కారులో ఉన్న ఇద్దరికి గాయాలు.. హైదరాబాద్‌ దుండిగల్‌లో ఘటన

ప్రహరీ గోడపై కారు! ఏదో సినిమా చిత్రీకరణలో భాగంగా అలా పెట్టారేమో అనుకునేరు! ప్రమాదవశాత్తే జరిగింది. రోడ్డుపై వేగంగా దూసుకెళుతూ డివైడర్‌ను ఢీకొని, అదే వేగంలో గాల్లోకి ఎగిరి.. రోడ్డు పక్కన ఉన్న ఇంటి ప్రహరీపై ఇలా సెటిల్‌ అయింది. ముంచుకొస్తున్న నిద్రను ఆపుకోలేక క్షణం పాటు కళ్లు మూసుకుపోయి.. మళ్లీ కళ్లు తెరిచి చూసే సరికి తాను నడుపుతున్న వాహనం గోడ మీద ఉండటం చూసి డ్రైవర్‌సాబ్‌కు మద్యం మత్తు వదిలిపోయింది! స్టీరింగ్‌ వదిలేసి.. డోరు ఓపెన్‌ చేసి కిందకు దూకి పారిపోయాడు. దుండిగల్‌ మునిసిపాలిటీలోని శంభీపూర్‌ గ్రామ పరిధిలోని మహేశ్వరం వద్ద శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు ఈ ఘటన జరిగింది.


డ్రైవర్‌ మద్యం మత్తులో మితిమీరిన వేగంతో కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఆ కారులో డ్రైవర్‌ కాకుండా మరో ఇద్దరు ఉన్నారు. వారికి స్వల్ప గాయాలయ్యాయి. భారీ శబ్ధం రావడంతో నిద్రలేచిన ఆ ఇంటి యజమాని, కుటుంబసభ్యులు ప్రహరీ మీద కారు ఉండటం చూసి నోరెళ్లబెట్టారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. ట్రాఫిక్‌ పోలీసులు అక్కడికి చేరుకొని.. క్రేన్‌ సాయంతో కారును కిందికి దింపారు. ఘటనపై కేసు నమోదైంది. ప్రహరీపై కారు ఉన్న ఫొటో నెట్‌లో వైరల్‌గా మారింది.

- దుండిగల్‌, (ఆంధ్రజ్యోతి)


ఈ వీడియోలను వీక్షించండి..

బెంబేలెత్తిస్తున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు!

గోవా గవర్నర్ గా రేపు అశోక్ గజపతి రాజు ప్రమాణస్వీకారం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 26 , 2025 | 05:37 AM