నీలగిరిలో మరో రూ.109 కోట్లతో అభివృద్ధి పనులు
ABN , Publish Date - Aug 03 , 2025 | 12:36 AM
నల్లగొండ పట్టణంలో మరో రూ.109 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వివిధ రకాల పనులకు ఈ ఆగస్టు నెలలోనే శంకుస్థాపన చేయనున్నారు.

నీలగిరిలో మరో రూ.109 కోట్లతో అభివృద్ధి పనులు
రోడ్లు, మురుగు, శ్మశానవాటికల అభివృద్ధి
ఈ నెలలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశం
రూ.56 కోట్లతో నడుస్తున్న పనులు
నల్లగొండ పట్టణంలో మరో రూ.109 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. వివిధ రకాల పనులకు ఈ ఆగస్టు నెలలోనే శంకుస్థాపన చేయనున్నారు. ప్రధానంగా పట్టణంలో మంచినీరు, రోడ్లు, డ్రైనేజీలు, వరద కాల్వ ల వంటి అభివృద్ధి పనులపై యంత్రాంగం దృష్టి సారించింది. పట్టణ ప్రజల అవసరాల మేర నాటి పాలకవర్గం ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో అధికారులు అందకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందించి టెండర్లు పిలిచారు. దీంతో హైదరాబాద్‌కు చెందిన బృంద ఇంజనీరింగ్ ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. దీంతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. నల్లగొండ పట్టణంలో మంచినీరు ఇప్పటి వరకు రోజు విడిచి రోజు వచ్చేవి. ఇకపై ప్రతీ రోజు మంచినీరు సరఫరా చేయాలన్న ఉద్దేశ్యంతో రూ.96 కోట్ల ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు.
- (ఆంధ్రజ్యోతి,రామగిరి)
పట్టణంలో రూ.109 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ఆనలైన టెండర్ ప్రక్రియ గతేదాది ప్రారంభించింది. టెండర్ ప్రక్రియలో బృంద ఇంజనీరింగ్ ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. ఈ రూ.109 కోట్లలో రూ. 55కోట్లతో 94 కి.మీ సీసీ రోడ్లు, రూ.11 కోట్లతో 9 కి.మీ బీటీ రోడ్డు, రూ. 19 కోట్లతో 9.5 కి.మీ వరద కాల్వలు, రూ.2 కోట్లతో గొల్లగూడ ప్రాంతం లో శ్మశానవాటికతో పాటు మరికొన్ని పనులు ఉన్నాయి. వీటి నిర్మాణానికి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ పనులు ఈ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
రూ.96 కోట్లతో మంచినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు
పట్టణ ప్రజలకు ప్రతీ రోజూ మంచినీరు అందించాలన్న ఉద్దేశ్యంతో రూ.96కోట్లతో పట్టణంలోని పానగల్ ప్రాంతంలో 70 ఎంఎల్‌డీ కెపాసిటీ గల మంచినీటి శుద్ధి కేంద్ర ఏర్పాటుకు గత పాలకవర్గం నిర్ణయించింది. ఈ మంచినీటి శుద్ధి కేంద్రం 2053 వరకు మంచినీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా డిజైన చేశారు. ఈ శుద్ధి కేంద్రం ప్రారంభమైతే పట్టణంలో ప్రతీరోజు మంచినీరు సరఫరా కానుంది. ఈ రూ.96 కోట్లతో 12 కిలోమీటర్ల పైపులైన్లతో పాటు మంచినీటి శుద్ధి కేంద్రానికి ఖర్చు చేయనున్నారు. ఇదిలా ఉండగా 2 లక్షల పైచిలుకు జనాభా ఉన్న నల్లగొండ పట్టణంలో ఇప్పటివరకు రోజు విడిచి రోజు 44 ఎంఎల్‌డీ మాత్రమే మంచినీరు సరఫరా అవుతుంది. అయితే నూతనంగా నిర్మించబోయే శుద్ధి కేంద్రం పూర్తయితే 114 ఎంఎల్‌డీ మంచినీరు ప్రతీ రోజు సరఫరా అయ్యే అవకాశం ఉంది. అర్బన ఇనఫ్రా డెవల్‌పమెంట్ ఫండ్ (యూఐడీఎఫ్) కేంద్ర ప్రభుత్వ నిధులతో పనులు చేసేందుకు ఇక్కడి అధికారులు, నాటి పాలకవర్గం కలిసి ఏడాది క్రితం హైదరాబాద్ మునిసిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదనలు నివేదించారు. ఈ ప్రతిపాదనలను పరిశిలించిన మునిసిపల్‌శాఖ కేంద్ర ప్రభుత్వానికి నివేదించనుంది. కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ ప్రారర భమయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే రూ.56 కోట్లతో కొనసాగుతున్న పనులు
ఇదిలాఉండగా అమృత -2 పథకం ద్వారా నల్లగొండ పట్టణంలో రూ.56 కోట్లతో మంచినీటి పనులు నడుస్తున్నాయి. వీటిలో రాంనగర్, అక్కచెల్మ, బత్తాయి మార్కెట్, వినాయక హౌసింగ్ బోర్డు కాలనీ, అన్నేశ్వరం గుట్ట, వల్లభరావు చెరువు, దత్తసాయి కాలనీ, ప్రభుత ్వ ఆసుపత్రి అవరణలో, మధురానగర్, పాతబస్తీ శివాలయం సమీపంలో, రాఘవేంద్ర నగర్ వంటి ప్రాంతాల్లో 11 ట్యాంకులతో పాటు 40 కిలోమీటర్ల మేర పైపులైన్ల పనులు నడుస్తున్నాయి.
ఠిఈ నెలలోనే పనులు ప్రారర భమయ్యే అవకాశం
రూ.109 కోట్లతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, వరద, మురుగుకాల్వల వంటి అభివృద్ధి పనులకు పిలిచిన టెండర్ ప్రక్రియ పూర్తయింది. స్థల పరిశీలన కూడా జరుగుతుంది. ఈ పనులు ఈ నెల చివరి వారంలోగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు రూ.40 లక్షలతో టెండర్లు పిలిచాం. ఈ ప్రక్రియలో కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. మీడియనలో మొక్కలను నాటేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం.
- సయ్యద్ ముసాబ్ అహ్మద్, మునిసిపల్ కమిషనర్