Share News

తది దశకు జీపీ భవనాలు నిర్మాణం

ABN , Publish Date - Apr 29 , 2025 | 01:42 AM

మండ లంలోని అల్వాలపురం, చిమిర్యాల, భీక్యాతండా, తొగర్రాయి, గుడిబండ, మంగళితండా, కాపుగల్లు, రెడ్లకుంట పంచాయతీ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.

తది దశకు జీపీ భవనాలు నిర్మాణం

తది దశకు జీపీ భవనాలు నిర్మాణం

కోదాడ రూరల్‌, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): మండ లంలోని అల్వాలపురం, చిమిర్యాల, భీక్యాతండా, తొగర్రాయి, గుడిబండ, మంగళితండా, కాపుగల్లు, రెడ్లకుంట పంచాయతీ కార్యాలయాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. వీటిలో భీక్యా తండా మినహా మిగిలిన ఆరు పంచాయతీ కార్యాలయాల్లో నూతన భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.20కోట్లను మంజూరు చేసింది. దీంతో పనులు దక్కించుకున్న కాంట్రా క్టర్లు పనులు ముమ్మరంగా చేయడంతో నిర్మాణం తుది దశకు వచ్చింది. జిల్ల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా, మెజారిటీ భవనాలు శిథిలావస్థకు చేరాయి. గతంలో ‘ఉపాధి’ నిధులతో కొన్ని భవనాలను నిర్మిం చగా, తాజాగా మరో 23 భవనాలకు ప్రభుత్వం రూ.4.60కోట్లు మంజూరు చేయడంతో ఐదు నెలల క్రితం శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో నూతన పాలకవర్గం కొలువుదీరే వరకు అందుబాటులోకి సిద్ధంగా ఉన్నాయి.

త్వరలో ప్రారంభిస్తాం

మండలంలోని ఆరు గ్రామ పంచాతీలకు నిధులు మంజూరయ్యాయి. చిమిర్యాల, గుడి బండ, రెడ్లకుంట, మంగళితండా, కాపుగల్లు, తొగర్రాయి పంచాయతీలకు రూ. 20లక్షలు చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారంభిస్తాం.

రామచంద్రరావు, ఎంపీడీవో

Updated Date - Apr 29 , 2025 | 01:42 AM