Chamala: బూతు పురాణానికి పేటెంట్ కేసీఆర్‌దే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 04:16 AM
బూతు పురాణానికి పేటెంట్ అంటూ ఉంటే అది మాజీ సీఎం కేసీఆర్‌దేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్‌రావుకు..

పదేళ్లలో ఆయన తిట్లతో పుస్తకమే రాయొచ్చు: చామల
బూతులకు బ్రాండ్ అంబాసిడర్.. కేసీఆరే: బీర్ల
హైదరాబాద్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): బూతు పురాణానికి పేటెంట్ అంటూ ఉంటే అది మాజీ సీఎం కేసీఆర్‌దేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. హరీశ్‌రావుకు.. కేసీఆర్ మాటలు నీతుల్లా, ఎదుటివారి మాటలు బూతుల్లా కనిపిస్తున్నాయా.. అని ప్రశ్నించారు. గడిచిన పదేళ్లలో కేసీఆర్ బూతు మాటలు, తిట్లతో ఒక పుస్తకమే రాయొచ్చని ఆదివారం ఓ ప్రకటనలో ఎద్దేవా చేశారు. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ధ్వజమెత్తారు.
కేంద్రమంత్రిని అసభ్య పదజాలంతో దూషించిన చరిత్ర ఆయనదేనని ఓ ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర పార్టీల నేతలను కేసీఆర్ ఎలా దూషించారో అందరికీ తెలుసన్నారు. ఆయన దూషణలు హరీశ్‌రావుకు వినసొంపుగా ఉన్నాయా అంటూ నిలదీశారు.