Share News

JP Nadda: తెలంగాణకు తగినంత యూరియా అందిస్తాం

ABN , Publish Date - Jul 10 , 2025 | 03:51 AM

తెలంగాణకు ఎరువుల కొరత లేకుండా సహకరిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు.

JP Nadda: తెలంగాణకు తగినంత  యూరియా అందిస్తాం

  • సీఎం రేవంత్‌ విజ్ఞప్తికి కేంద్రమంత్రి నడ్డా స్పందన

న్యూఢిల్లీ, జూలై 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణకు ఎరువుల కొరత లేకుండా సహకరిస్తామని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఢిల్లీలో నడ్డాను కలిసి తెలంగాణకు కేటాయించిన ఎరువులను సకాలంలో సరఫరా చేయాలని కోరిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌-జూన్‌ మధ్య 5 లక్షల టన్నుల సరఫరా చేయాల్సి ఉండగా 3.07 లక్షల టన్నులు మాత్రమే సరఫరా చేశారని సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నడ్డా స్పందిస్తూ రాష్ట్ర రైతుల నిజమైన డిమాండ్‌ను తీర్చడానికి తెలంగాణకు మద్దతుగా నిలుస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో మోతాదుకు మించి యూరియాను వినియోగిస్తున్నారని, తగ్గించుకోవాలని సూచించారు.


అధిక యూరియా వినియోగంతో భూముల సారం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో రబీకి దాదాపు 21 శాతం అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని తెలిపారు. 2024-25 ఖరీ్‌ఫతో పోలిస్తే 2025-26 ఖరీ్‌ఫలో ఇప్పటి వరకు 12.4 శాతం అదనపు వినియోగం జరిగిందని పేర్కొన్నారు. సేంద్రియ-సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘పీఎం ప్రణామ్‌’ పథకం గురించి తమ శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌.. ముఖ్యమంత్రి బృందానికి వివరించారని తెలిపారు. వ్యవసాయేతర అవసరాలకు యూరియాను మళ్లించకుండా చర్యలు తీసుకోవాలని కూడా కోరారని పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వాట్సాప్‌లో రెండు కొత్త ఫీచర్స్.. వీటి స్పెషల్ ఏంటంటే..

యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 10 , 2025 | 03:51 AM