Share News

Car Accident: కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి.. ఇంటి గోడ ఎక్కి..

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:44 PM

Car Accident: ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును కిందకు దించారు.

Car Accident: కారు బీభత్సం.. డివైడర్‌ను ఢీకొట్టి.. ఇంటి గోడ ఎక్కి..
Car Accident

మేడ్చల్ జిల్లా శంభీపూర్‌లో కారు భీభత్సం సృష్టించింది. నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ కారును డివైడర్‌కు ఢీ కొట్టాడు. అనంతరం కారు ఎగిరి ఇంటి గోడపై పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో కారును కిందకు దించారు.


దుండిగల్ పీఎస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అక్కడెలా పెట్టావురా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీ పేసర్ యశ్ దయాళ్‌కు కొత్త చిక్కులు.. మరో యువతి వేధింపుల ఆరోపణలు

ట్రాక్టర్ కంపెనీలకే షాకిచ్చాడుగా.. ఇతడి వాహనాన్ని చూస్తే ఖంగుతినాల్సిందే..

Updated Date - Jul 25 , 2025 | 02:49 PM