Share News

Domestic Violence: అక్కను చంపిన తమ్ముడు!

ABN , Publish Date - Jul 29 , 2025 | 04:56 AM

తోడబుట్టిన అక్కను తమ్ముడు గొంతు పిసికి చంపేశాడు. ఓ యువకుడితో ఆమె ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసి కోపం పట్టలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Domestic Violence: అక్కను చంపిన తమ్ముడు!

  • వైర్‌తో గొంతు బిగించి హత్య

  • యువకుడితో ఆమె ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసి ఆగ్రహం పట్టలేకే.. రంగారెడ్డి జిల్లాలో ఘటన

కొత్తూర్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): తోడబుట్టిన అక్కను తమ్ముడు గొంతు పిసికి చంపేశాడు. ఓ యువకుడితో ఆమె ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసి కోపం పట్టలేక ఈ దారుణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా, కొత్తూర్‌ పరిధిలోని పెంజర్ల గ్రామానికి చెందిన రుచిత (21) డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు రుచితను కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయంలో రుచిత తల్లిదండ్రులు పంచాయితీ పెట్టి తన కుమార్తెతో మాట్లాడొద్దని ఆ యువకుడిని హెచ్చరించారు. ఇది జరిగాక రుచిత, ఆ యువకుడు కొన్నాళ్లు మాట్లాడుకోలేదు.


సోమవారం రుచిత తల్లిదండ్రులు ఏదో పని మీద బయటకు వెళ్లారు. రుచిత ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించిన తమ్ముడు రోహిత్‌ (19) ఎందుకు మళ్లీ ఆ యువకుడితో మాట్లాడుతున్నావంటూ ఆమెను నిలదీశాడు. ఇది ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన రోహిత్‌ వైర్‌తో రుచిత గొంతు బిగించాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలొదిలింది. పోలీసులొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తండ్రి రాఘవేందర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నర్సింహారావు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు

22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్

For More National News and Telugu News..

Updated Date - Jul 29 , 2025 | 04:57 AM