Share News

Bank Holidays In August : ఆగష్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు

ABN , Publish Date - Jul 27 , 2025 | 07:11 PM

2025 ఆగష్టు నెలలో బ్యాంకులకు భారీగానే సెలవులు ఉన్నాయి. ఏయే రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలియకపోతే, ఇబ్బందుల్లో పడతారు. ఆ ప్రకారంగా బ్యాంకు పనులు ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

Bank Holidays In August : ఆగష్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు
Bank Holidays in August

Bank Holidays in August : దైనందిన జీవితంలో బ్యాంకులకు వెళ్లడం అనేది సర్వసాధారణం. అంతేకాదు, అత్యంత ముఖ్యం కూడా. తీరా బ్యాంకుకు వెళ్లాక సెలవు అని తెలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాలి. అందుకే బ్యాంక్ సెలవులు ఈ వారంలో ఎప్పుడున్నాయన్నది ప్రతీ వారం చూసుకోవాల్సిన పరిస్థితి. సాధారణంగా బ్యాంకులకు ఆది వారాలు, పండగల రోజుల్లో సెలవు ఉంటుంది. అయితే, రాష్ట్రాల వారీగా సెలవులు మారుతుంటాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సర్క్యూలర్ ప్రకారం అసలు ఆగష్టు నెలలో మొత్తంగా ఎన్ని సెలవు దినాలు ఉన్నాయో చూద్దాం.


ఆగస్టు, 2025 నెలలో బ్యాంక్ సెలవుల జాబితా

  • ఆగస్టు 3వ తేదీ ఆదివారం: సాధారణ సెలవు

  • ఆగస్టు 8వ తేదీ శుక్రవారం: సిక్కిం, ఒడిశా ప్రాంతాల్లో సెలవు (గిరిజన పండుగ.. టెండాంగ్‌లో రమ్ ఫండ్)

  • ఆగస్టు 9వ తేదీ శనివారం: రెండో శనివారపు సాధారణ సెలవు, అంతేకాక రక్షా బంధన్ పండుగ సెలవు కూడా

  • ఆగస్టు 10వ తేదీ ఆదివారం: సాధారణ సెలవు

  • ఆగస్టు 13వ తేదీ బుధవారం: మణిపూర్‌లో రాష్ట్ర స్థాయి పండుగ (దేశ భక్తి దివస్)

  • ఆగస్టు 15వ తేదీ శుక్రవారం: స్వాతంత్య్ర దినోత్సవం సెలవు

  • ఆగస్టు 16వ తేదీ శనివారం: జన్మాష్టమి, ఇంకా పార్సీ నూతన సంవత్సర సెలవు

  • ఆగస్టు 17వ తేదీ ఆదివారం: సాధారణ సెలవు

  • ఆగస్టు 19వ తేదీ మంగళవారం: త్రిపురలో సెలవు (మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ జన్మదినం)

  • ఆగస్టు 23వ తేదీ శనివారం: నాలుగో శనివారం కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు

  • ఆగస్టు 24వ తేదీ ఆదివారం: సాధారణ సెలవు

  • ఆగస్టు 25వ తేదీ సోమవారం: అసోంలో బ్యాంకులకు సెలవు (శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి)

  • ఆగస్టు 27వ తేదీ బుధవారం: గణేష్ చతుర్థి సందర్భంగా ఏపీ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, గోవా, తమిళనాడు, మహారాష్ట్రలో బ్యాంకులకు సెలవు

  • ఆగస్టు 28వ తేదీ గురువారం: నువాఖై, గణేష్ చతుర్థి సందర్భంగా గోవా, ఒడిశా ప్రాంతాల్లో సెలవు

  • ఆగస్టు 31వ తేదీ ఆదివారం: సాధారణ సెలవు


ఇవి కూడా చదవండి..

ఆరేళ్ల తర్వాత మాతోశ్రీకి వెళ్లిన రాజ్‌ఠాక్రే..ఎందుకంటే

జన్‌ సురాజ్ ఓట్లు చీల్చే పార్టీ.. కానీ ట్విస్ట్ ఉంటుంది

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 27 , 2025 | 07:18 PM