Star Actress: వెండితెర అందాల భామలు.. చిన్నప్పటి ఫన్నీ మూమెంట్స్
ABN , Publish Date - Apr 16 , 2025 | 10:22 PM
అసలే అమ్మాయిలు, అందరికీ తెలిసిన అందాల భామలు వాళ్లంతా.. ఈ వయసులోనే ఇంత అందగత్తెలై వెండితెరల్ని ఏలుతుంటే, ఇక వాళ్లు చిన్నప్పుడు ఇంకెంత ముద్దొచ్చే వాళ్లో..

Star Actress Childhood Days: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. తిమ్మిని బమ్మిని.. బమ్మిని తిమ్మెని చేసేస్తోంది. వచ్చే పదేళ్ల కాలంలో ఏఐ ఫలితంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు ఆస్కారం ఉంటుందని టెక్ దిగ్గజాధిపతులే ఖరాఖండిగా చెబుతున్నారు. ఇప్పటికే చూచాయిగా ఏఐ మాయాజాల్ని జనం రుచిచూస్తున్నారు. ఏఐ ఉపయోగించి చిన్న పిల్లలు.. యుక్తవయస్కులు వారి వృద్ధాప్యంలో ఎలా ఉంటారనేది ఏఐ సాయంతో ఎంతో అబ్బురపరిచేలా కళ్లముందు పెడుతున్నారు. తాజా ఇలాంటిదే ఒక వీడియో అందర్నీ ఆకర్షిస్తోంది.
వెండితెరపై తమ అద్భుతమైన నటన, అందంతో ప్రేక్షకుల మనసులు దోచుకున్న హీరోయిన్లు తమ బాల్యంలో ఎలా ఉండేవారనే దానిని ఏఐ సాయంతో ఫొటోలు, వీడియోలు రూపొందించి నెట్టింట్లో పెట్టారు. ఇది అందర్నీ విశేషంగా ఆకర్షిస్తోంది. ఇంతగా ఆకర్షించడానికి మరో కారణం ఏంటంటే, అసలే అమ్మాయిలు, అందరికీ తెలిసిన అందాల భామలు వాళ్లంతా.. ఈ వయసులోనే ఇంత అందగత్తెలై వెండితెరల్ని ఏలుతుంటే, ఇక వాళ్లు చిన్నప్పుడు ఇంకెంత ముద్దొచ్చే వాళ్లోకదా. అదే ఈ వీడియోలో కనిపిస్తోంది.
ఈ వీడియోలో తమన్నా, సాయిపల్లవి, కాజల్, నయనతార, కీర్తి సురేష్ తదితరులు చిన్నప్పుడెలా ఉండేవాళ్లో అనుకుంటే.. ఇట్టే కళ్లముందు కదలాడుతున్నారు. ఆహ్లాదభరితంగా ఉన్న ఈ వీడియో మీరూ చూసి చిరుమందహాసం చేసేయండి. అన్నట్టు వీడియో లాస్ట్ లో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఎవరో గుర్తుపట్టండి చూద్దాం..
ఇవి కూడా చదవండి:
WhatsApp Security: మీ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అయిందా..ఇలా ఈజీగా మళ్లీ యాక్సెస్ పొందండి..
Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..
Bill Gates: వారానికి మూడు రోజేలే పని..బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
iPhone like Design: రూ.6 వేలకే ఐఫోన్ లాంటి స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు తెలిస్తే షాక్ అవుతారు..
Read More Business News and Latest Telugu News