Share News

Arrest, World Champion: బాయ్‌ఫ్రెండ్‌పై దాడి

ABN , Publish Date - Aug 03 , 2025 | 06:07 AM

మహిళల 100 మీటర్ల డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ షకేరి రిచర్డ్‌సన్‌ గృహ హింస కేసులో అరెస్టయింది. గత ఆదివారం సియాటెల్‌ విమానాశ్రయంలో...

Arrest, World Champion: బాయ్‌ఫ్రెండ్‌పై దాడి

100 మీటర్ల వరల్డ్‌ చాంపియన్‌ షకేరి అరెస్ట్‌

సియాటెల్‌ (అమెరికా): మహిళల 100 మీటర్ల డిఫెండింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌ షకేరి రిచర్డ్‌సన్‌ గృహ హింస కేసులో అరెస్టయింది. గత ఆదివారం సియాటెల్‌ విమానాశ్రయంలో తన బాయ్‌ఫ్రెండ్‌, అమెరికాకే చెందిన మరో ప్రఖ్యాత స్ర్పింటర్‌, 100 మీటర్ల ప్రపంచ మాజీ చాంపియన్‌ క్రిస్టియన్‌ కోల్‌మన్‌పై దాడి చేసినందుకు పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. కోల్‌మన్‌తో వాదనకు దిగిన ఆమె అతడిని బలంగా నెట్టివేయడంతో విమానాశ్రయంలోని ఓ గోడకు అతడు గుద్దుకొన్నాడు. విమానాశ్రయ సీసీ కెమెరా ఫుటేజ్‌లో..కోల్‌మన్‌పై రిచర్డ్‌సన్‌ ఏదో వస్తువును విసరడం కూడా కనిపించింది. దాంతో రిచర్డ్‌సన్‌పై నాలుగో డిగ్రీ గృహహింస కేసు నమోదు చేసి ఆదివారం సాయంత్రం అరెస్ట్‌ చేశారు. అనంతరం సోమవారం మఽధ్యాహ్నం ఆమెను విడుదల జేశారు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన 25 ఏళ్ల షకేరి, 29 ఏళ్ల కోల్‌మన్‌ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 03 , 2025 | 06:07 AM