Share News

Super Over win: వెస్టిండీస్‌ సూపర్‌ విన్‌

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:38 AM

తొలి మ్యాచ్‌ నెగ్గి జోరుమీదున్న బంగ్లాదేశ్‌కు రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఝలకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్లో నెగ్గిన వెస్టిండీస్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత బంగ్లాదేశ్‌...

Super Over win: వెస్టిండీస్‌ సూపర్‌ విన్‌

మిర్పూర్‌: తొలి మ్యాచ్‌ నెగ్గి జోరుమీదున్న బంగ్లాదేశ్‌కు రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఝలకిచ్చింది. ఈ మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్లో నెగ్గిన వెస్టిండీస్‌ సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. తొలుత బంగ్లాదేశ్‌ 7 వికెట్లకు 213 రన్స్‌ చేసింది. సౌమ్య సర్కార్‌ (45) టాప్‌స్కోరర్‌. మోటీ 3, అకీల్‌, అథనజె చెరో 2 వికెట్లు తీశారు. ఛేదనలో కెప్టెన్‌ హోప్‌ (53 నాటౌ ట్‌) రాణించడంతో విండీస్‌ 9 వికెట్లకు 213 రన్స్‌ చేసి స్కోరు సమం చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌లో మొదట 10/1 చేసిన విండీస్‌.. తర్వాత బంగ్లాను 9/1కే పరిమితం చేసి పరు గు తేడాతో నెగ్గింది.

50 ఓవర్లూ స్పిన్నర్లతోనే..

ఈ మ్యాచ్‌తో వెస్టిండీస్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మ్యాచ్‌లో విండీస్‌ తరఫున బౌలింగ్‌ చేసిన ఐదుగురూ స్పిన్నర్లే కావ డం విశేషం. ఇలా.. ఒక వన్డేలో మొత్తం 50 ఓవర్లనూ స్పిన్నర్లతోనే బౌలింగ్‌ చేయించిన తొలి జట్టుగా విండీస్‌ చరిత్ర సృష్టించింది. ఈ రికార్డు ఇంతకుముందు శ్రీలంక (1996లో 44 ఓవర్లు) పేరిట ఉండేది. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 92 ఓవర్లు స్పిన్నర్లే వేశారు. దీంతో అంతకుముందు ఉన్న 78 ఓవర్ల రికార్డు చెరిగిపోయింది.

ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 02:38 AM